నోరూరించే శెనగపిండి కోవా

శెనగపిండి - ఒక కప్పు
పాల పొడి - పావు కప్పు
నెయ్యి - అర కప్పు
కొబ్బరి తురుము - అర కప్పు
పంచదార పొడి - ముప్పావు కప్పు
పాలు - ఒక కప్పు

కళాయిలో అరస్పూను నెయ్యి, శెనగపిండి వేసి వేయించాలి.

శెనగపిండి కాస్త రంగు మారాక పాల పొడి, కొబ్బరి తురుము కూడా వేయించాలి.

అన్నింటినీ బాగా కలిసేలా గరిటెతో కలిపి పాలు పోయాలి.

ఇప్పుడు పంచదార పొడి కూడా వేసి కలపాలి.

పంచదార కరిగి ఆ మిశ్రమంలో కలుస్తుంది. రెండు మూడు స్పూన్ల నెయ్యి కూడా వేసి కలపాలి.

మిశ్రమం దగ్గరగా కోవాలా అయ్యే వరకు ఉంచి మంటను కట్టేయాలి.

మిశ్రమం కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని కోవాలా ఒత్తుకోవాలి.