ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. మరి, రోజూ ఉల్లిరసం తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఎలా తయారు చేయాలి?: తొక్కతీసిన ఉల్లిని కట్ చేసి మిక్సీలో వేయండి. ఆ మిశ్రమంలో కాస్త తేనె వేసి తాగేయండి.

ఉల్లిరసంలో విటమిన్-బి6, విటమిన్-సి, కాల్షియం, ఫైబర్, ఐరన్, పోటాషియం, మాంగనీస్, పాస్పరస్ ఉంటాయి.

ఉల్లిరసాన్ని పీచుతోపాటు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

రోజూ ఉల్లిరసం తాగితే బరువు తగ్గుతారు. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి.

తేనెతో కలిపి ఉల్లిరసాన్ని తీసుకుంటే జలుబు, జ్వరం, దగ్గు తగ్గుముఖం పడతాయి.

ఉల్లిలోని సల్ఫర్.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి డయాబెటిస్‌కు మంచిదే.

ఉల్లిరసాన్ని తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే పచ్చి ఉల్లిపాయాలను ఆహారంతో తీసుకోండి.

పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

ఉల్లి రసాన్ని (తేనే లేకుండా) తలకు రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది.

ఉల్లి.. క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.

ఉల్లి కొందరికి అలర్జీని కూడా కలిగిస్తుంది. కాబట్టి డాక్టర్ సలహా తర్వాతే ఉల్లి రసాన్ని ప్రయత్నించండి.

Images Credit: Pexels, Pixabay & Unsplash