ఎండలో నిలుచుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ? రోజూ సూర్యకాంతి తగిలితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా తెల్లవారిజామున వచ్చే ఎండలో నిలుచుంటే ఆరోగ్యానికి , చర్మానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి . ఎండలోని విటమిన్-డి మీ బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచేందుకు సహాయపడుతుంది . విటమిన్-డి వల్ల స్కిన్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి , చర్మ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది . ఎండవల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది . ఉదయం 8 గంటల ముందు 30 నిమిషాల పాటు బయటికి వెళ్లడం వల్ల బరువు తగ్గవచ్చు. సూర్యకిరణాలు మీ నిద్రను కూడా మెరుగుపరుస్తాయి . ఎండ ద్వారా మీ శరీరంలో మెలటోనిన్ లెవెల్స్ పెరిగి హాయిగా నిద్ర పడుతుంది . Image source - Pexels