చలికాలంలో విరివిగా దొరికే వాటిలో ఉసిరి కాయ ఒకటి. ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి. మంచు వల్ల కళ్లకి కలిగే ఎర్రదనం, దురదను ఇది దూరం చేస్తుంది. దీనిలోని ఫ్రీ రాడికల్స్ చర్మ కణాలు దెబ్బతినకుండా చేస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి.. కడుపు సమస్యలను దూరం చేస్తుంది. దీనిలోని ఖనిజాలు, లవణాలు బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి.