యోగా, ప్రాణాయామాలను ప్రాచీన భారతీయ ఆరోగ్య జీవన విధానాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

లయబద్ధంగా, నియమబద్దంగా సాగే శ్వాస విధానాన్ని అనుసరించడమే ప్రాణాయామం.

ప్రాణాయమంతో పారాసింపాథిటిక్ నాడీవ్యవస్థను చురుకుగా ఉంటుంది. మన శరీరాలు విశ్రాంతి స్థితిని అనుభవిస్తాయి.

ప్రాణాయామంలో ఉద్దేశ్యపూర్వకంగా సాగే శ్వాస క్రియ వల్ల శ్వాసవ్యవస్థ బలోపేతం అవుతంది. దీర్ఘ శ్వాస వల్ల శ్వాస వ్యవస్థ క్లియర్ అవుతుంది.

క్రమబద్ధంగా నిర్ణీత లయలో సాగే శ్వాస వల్ల భావావేశాలు అదుపులో ఉంటాయి. ఉల్లాసభరితంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

నీరసంగా ఉండడం, బద్ధకం వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. రోజంతా చురుకుగా ఆరోగ్యంగా ఉన్న భావన కలుగుతుంది.

దీర్ఘమైన, నిర్ణీత శ్వాస క్రియతో వినాళ వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని టాక్సిన్స్ విసర్జితమవుతాయి.

ప్రాణాయామంతో రోగా నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels