భోజనం చేశాక నడిస్తే ఎన్ని లాభాలో



భోజనం చేశాక చాలా మంది భుక్తాయాసంతో కూర్చుండిపోతారు.



భోజనం చేశాక కాసేపు నడిస్తే ఎంతో ఆరోగ్యం.



తిన్నాక నడవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కెలోరీలు అధికంగా కరుగుతాయి.



రోగనిరోధక కణాలను చురుకుగా మార్చి వ్యాధి నిరోధక వ్యవస్థ చక్కగా పనిచేసేలా చేస్తుంది.



మధుమేహులు భోజనం చేశాక నడిస్తే రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి.



నడక వల్ల రాత్రికి నిద్ర కూడా హాయిగా పడుతుంది.



అర్థరాత్రి ఆకలి వేయడం తగ్గుతుంది.



నడక వల్ల మనసు రిఫ్రెష్ అవుతుంది.



రోజూ కనీసం అరగంట సేపు నడిచేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం మీ సొంతమవుతుంది.