ఆలివ్ ఆయిల్ ఆరోగ్యంతో పాటు అందానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనితో రెగ్యూలర్‌గా మసాజ్ చేస్తే వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. చలికాలంలో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి పొడిబారకుండా చేస్తుంది. కళ్లు ఉబ్బినట్లు ఉన్నాయా? అయితే దీనితో మసాజ్ చేయండి. చర్మాన్ని క్లెన్సింగ్ చేయడంలో ఆలివ్ చాలా హెల్ప్ చేస్తుంది. పొల్యూషన్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడి.. హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. మృతకణాలు తొలగించి.. చర్మానికి నిగారింపునిస్తుంది.