నెమలీకలు ఇంట్లో ఉంటే సంపదే సంపద నెమలికన్నులు చూడముచ్చటగా ఉంటాయి. చాలా మంది గుత్తులుగా ఇంట్లో గోడలకు పెట్టుకునేందుకు ఇష్టపడతారు. కొందరిలో మాత్రం ఇంట్లో నెమలికన్నులను ఉంచవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. అందమైన నెమలీకలను ఇంట్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎన్నో లాభాలు కూడా కలుగుతాయి. గోడలపై నెమలీకల గుత్తిని తగిలిస్తే బల్లులు, ఇతర కీటకీలు మీ ఇల్లు వదిలి పారిపోతాయి. నెమలి నృత్యం చేసే భంగిమలో నెమలి కన్నులను అమరిస్తే ఆ గదికి గొప్పగా, ఆడంబరంగా కనిపిస్తుంది. నెమలి ఈకలను మీ కార్యాలయంలో, ఇంట్లో పెట్టుకుంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. నివాసస్థలంలో వీటిని ఉంచితే వాస్తుదోషాలు కూడా పోతాయి. మానసిక ఒత్తిడి పోయి ప్రశాంతంగా అనిపిస్తుంది. నెమలీకలను ఇంట్లోని ఆగ్నేయదిశలో ఉంచితే చాలా మంచిదని చెబుతారు. ఇలా ఉంచడం వల్ల సంపద, ఆనందం పెరుగుతాయని ఎంతో మంది నమ్మకం. వినాయక విగ్రహానికి నెమలీకను జత చేయడం వల్ల అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు దోషం కూడా పోతుంది. ఇంట్లో సంపద పెరగాలంటే నెమలికన్నులను తెచ్చి మీరు డబ్బులు దాచే చోట పెట్టుకోవాలి.