ఉదయం నిద్ర లేవగానే తాగడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం నిద్ర లేచేసరికి శరీరం డీహైడ్రేటెడ్ స్థితిలో ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత వెంటనే నీళ్లు తాగడం అవసరం.

పొద్దున్నే నీళ్లు తాగితే జీవక్రియలు మెరుగుపడుతాయి. నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగడం తప్పనిసరి.

ఆసిడ్ రిఫ్లక్స్, హార్ట్ బర్న్ సమస్య ఉన్నపుడు నిద్ర లేవగానే నీళ్లు తాగితే సమస్య తీవ్రత తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.

ఉదయమే నీళ్లు తాగితే జీవక్రియల వేగం 24 శాతం పెరుగుతుంది. అందువల్ల శరీర బరువు త్వరగా తగ్గుతుంది.

టాక్సిన్స్ సులభంగా విసర్జించబడి శరీరం శుభ్రపడుతుంది. క్రమంగా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.

రోజూ ఉదయాన్నే నీళ్లు తాగే అలవాటు కిడ్నీల్లో రాళ్ల ఏర్పడకుండా నిరోధిస్తుంది.

చర్మం పొడిబారి పోకుండా నిరోధిస్తుంది. రక్త ప్రసరణ మెరుగువుతుంది. కొత్త చర్మ కణాల ఉత్పత్తి పెరుగుతుంది.

ఉదయమే నీళ్లు తాగడం వల్ల శరీరం రోజంతా శక్తిమంతంగా ఉంటుంది.

పరగడుపున నీళ్లు తాగితే మెదడు కూడా చురుకుగా ఉంటుంది.
Images courtesy : Pexels