శీతాకాలంలో జీడిపప్పు నానబెట్టి తింటే రుచితో పాటు పోషకాలు అందుతాయి. నానబెట్టిన జీడిపప్పు తింటే కలిగే లాభాలు తెలుసుకుందాం. కాజులో ఉండే ఫైటిక్ ఆసిడ్ నానబెట్టినపుడు మృదువుగా మారి జీర్ణం కావడం సులభం అవుతుంది. నీళ్లలో నానినపుడు జీడిపప్పుల్లోని యాంటీ న్యూట్రియెంట్ కంటెంట్ నిరోధించబడుతుంది. జీడి పప్పులో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శీతాకాలంలో నానబెట్టిన జీడిపప్పులు తింటే నిరోధక వ్యవస్థ బలం పుంజుకుంటుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను శరీరం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి స్థిరంగా శక్తి విడుదల చేస్తాయి. రోజంతా శక్తిమంతంగా ఉంచుతాయి. సెలీనియం, విటమిన్లు ఇ, కె జీడిపప్పులో ఉంటాయి. ఇవి ఆక్సికరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని కాపాడుతాయి. నానబెట్టిన జీడిపప్పులో ఉండే ఫైబర్లు రక్తంలో గ్లూకోజ్ నిర్వహణకు తోడ్పడుతాయి. గుండె ఆరోగ్యానికి జీడిపప్పులు చాలా అవసరం. వీటిలోని కొవ్వులు కార్డియోవాస్క్యూలార్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. Images courtesy: Pexels