సులభంగా తయారు చెయ్యగలిగే వంట పద్ధతి స్టీమింగ్. స్టీమ్ చేసిన ఆహారం వల్ల చాలా లాభాలున్నాయట అవేమిటో తెలుసుకుందాం.

పదార్థాలను ఉడికించేందుకు నూనె అవసరం ఉండదు. కేవలం నీళ్లే ఉపయోగిస్తారు. అదనపు క్యాలరీలు చేరవు.

ఉడికించడం వల్ల ఆహారంలో పోషక విలువలు నిలిచి ఉంటాయి.

స్టీమింగ్ విధానంలో ఆహారం ఉడికించేందుకు నీటిఆవిరిని ఉపయోగిస్తారు.

సంప్రదాయ విధానంలో నీటిలో వేసి మరిగించడం లేదా నూనెలో వేయించి పదార్థాలు తయారు చేసేవారు.

నీటిలో మరిగించినపుడు కొన్ని పోషకాలు నష్టపోతాయి. కానీ స్టీమింగ్ లో పోషకాలన్ని నిలిచి ఉంటాయి.

బరువు తగ్గాలనుకునే వారికి నూనె వాడని ఈ స్టీమింగ్ విధానంలో వండిన ఆహారం మంచి ఆప్షన్.

స్టీమింగ్ వల్ల కూరగాయలు మృదువుగా మారుతాయి. జీర్ణం కావడం సులభం అవుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి.

స్టీమ్ చేసిన ఆహారం వల్ల శరీరంలో అదనంగా కొలెస్ట్రాల్ చేరదు.
Images courtesy : Pexels