చూడగానే నోరూరించే ఉసిరికాయ చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

ఉసిరిలో కేలరీలు, ఫ్యాట్స్ తక్కువగా.. కాపర్, మాంగనీస్, విటమిన్స్ - C, B5, B6 ఎక్కువగా ఉంటాయి.

ఊబకాయం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌లతో పోరాడేందుకు సహకరిస్తుంది.

ఉసిరిలోని ఫైటోన్యూట్రియెంట్స్, E, C విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మెదడును రక్షిస్తాయి. వృద్ధాప్యాన్ని అడ్డుకుంటాయి.

ఉసిరిలో ఫైబర్, క్లోరోజెనిక్ ఆమ్లం అధికంగా ఉంటాయి. ఇవి మీ రక్తప్రవాహంలోకి చక్కెర శోషణను నిరోధిస్తాయి.

ఉసిరిలోని సిట్రిక్ యాసిడ్, ఫినాల్స్, యాంటీఆక్సిడెంట్లు.. అల్జీమర్స్, స్ట్రోక్ నుంచి కాపాడతాయి.

ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్స్ వంటి పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లతో పోరాడతాయి.

ఉసిరిని పచ్చిగా తినొచ్చు. తృణధాన్యాలు, పెరుగు, సలాడ్లు లేదా వంటకాల్లో కూడా జోడించి తీసుకోవచ్చు.

Images Credit: Pixabay