అంజీర్ బలవర్దకమైన డ్రైఫ్రూట్. పాలలో కూడా పోషకాలు పుష్కలం. రెండూ కలిపి తీసుకుంటే లాభాలు మెండు.

అంజీర్ , పాలలో క్యాల్షియం ఉంటుంది. రెండూ కలిపి తీసుకుంటే ఎముకలు, దంతాలు బలోపేతం అవుతాయి.

అంజీర్ లోని సహజ చక్కెరల వల్ల రోజంతా శక్తిమంతంగా ఉండొచ్చు.

అంజీర్ పాలు కలిపి తీసుకున్నపుడు సులభంగా జీర్ణం అవుతాయి. మలబద్దకాన్ని నివారిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కలిగిన అంజీర్ ను ప్రొటీన్ కలిగిన పాలతో కలిపి తీసుకుంటే చర్మం నిగనిగలాడుతూ మెరుపులీనుతుంది.

అంజీర్ కలిపిన పాలు తాగితే బ్లడ్ షుగర్ కూడా అదుపులో ఉంటుంది.

అంజీర్ పాలతో పోషకాలు అందడం మాత్రమే కాదు, కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. క్యాలరీ ఇన్టేక్ తగ్గుతుంది.

అంజీర్ పాలు తాగితే ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా అందుతాయి. కనుక అనిమియాతో బాధపడే వారికి మంచి ఆహారం.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels