చికెన్ కన్నా చింతచిగురు ధరే ఎక్కువ

చైత్రమాసంలో చింతాకు పూస్తుంది. చెట్టు నిండా లేతాకు నోరూరిస్తుంది.

చాలా చోట్ల దీని ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కిలో రూ.500 నుంచి 600 దాకా పలుకుతోంది.

కిలో చికెన్ ధరే రూ.300 ఉంది, అంటే దీని కన్నా చింతచిగురు ధరే ఎక్కువ.

సాధారణం కిలో చింతచిగురు రూ.100 ఉంటుంది. కానీ చెట్లు తరిగిపోవడంతో ఇలా రేటు పెరిగిపోయింది.

పప్పు చింతచిగురు, చింత చిగురు పచ్చడి, రొయ్యలు చింత చిగురు కూర, చికెన్ చికెన్ చింతచిగురు, మటన్ చింత చిగురు, చింత చిగురు పులిహోర... ఇలా ఎన్నో రెసిపీలు దీంతో వండుకోవచ్చు.

నెలసరి సమయంలో ఆడవారిలో కనిపించే సమస్యలకు ఇందులో ఉండే పోషకాలు చెక్ పెడతాయి.

థైరాయిడ్ సమస్య ఉన్న వారు చింత చిగురుతో చేసిన వంటకాలు తినడం వల్ల వారికి తగ్గే అవకాశం ఉంది.

దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.