క్యారెట్ జ్యూస్ తాగితే ఏమవుతుందంటే... క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఇందులో బీటాకెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపుకు అత్యవసరం. దీనిలో విటమిన్ సి అధికం. వీటిని తింటే ఏ గాయమైనా త్వరగా తగ్గిపోతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడుతాయి. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి బరువు పెరగరు. గుండెజబ్బులు, స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.