బాదాం లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మం, జుట్టుకు సహజమైన మాయిశ్చరైజర్ లా జుట్టును, చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. బాదాం నూనె క్రమం తప్పకుండా చర్మానికి రాసుకుంటే స్కిన్ టోన్, టెక్చర్ మెరుగవుతుంది. బాదాం నూనెలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కళ్లకింద వలయాలు, వాపు తగ్గిస్తుంది. కళ్ల కింద నెమ్మదిగా మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగయ్యి చర్మం తెల్లగా మారుతుంది. క్రమం తప్పకుండా మాడు మీద బాదాం నూనెతో మసాజ్ చేస్తే జుట్టు బలంగా తయారై తెగిపోకుండా ఉంటుంది. బాదాములలో ఉండే పోషకాల వల్ల చుండ్రు, స్కాల్ప్ మీద ఏర్పడిన ఇన్ఫ్లమేషన్, దురద తగ్గుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy : Pexels