చర్మానికి రంగులు అంటుకోకుండా ఉండాలన్నా.. అంటుకున్నవి వదిలించుకోవాలన్నా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

చర్మాన్ని రెండు రోజుల ముందునుంచే ప్రిపేర్ చేయాలి. మాయిశ్చరైజర్​ని ఎక్కువ మోతాదులో అప్లై చేస్తూ హైడ్రేటెడ్​గా ఉంచాలి.

చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. దీనివల్ల స్కిన్ స్మూతీగా రంగులు అంటుకోకుండా చేస్తుంది.

కొబ్బరి నూనె లేదా ఆలివ్​ నూనె, పెట్రోలియం జెల్లీని స్కిన్​కి అప్లై చేసినా మంచిది. ఇది రంగుల నుంచి స్కిన్​ని కాపాడుతుంది.

హోలీ ఆడిన తర్వాత ముఖానికి మాస్క్ అప్లై చేస్తే.. రంగులు పూర్తి స్థాయిలో తొలగి.. స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి.

రంగులను వదిలించుకోవడానికి హార్ష్ సబ్బులు వాడడం మానేస్తే మంచిది. ఇవి చర్మాన్ని మరింత పొడిగా చేస్తాయి.

హోలీ ఆడిన వెంటనే స్నానం చేస్తే రంగులు త్వరగా వదిలిపోతాయి. స్కిన్​పై ఎలాంటి మరకలు ఉండవు.

మైల్డ్ క్లెన్సర్ చర్మాన్ని బాగా క్లీన్ చేస్తుంది. వేడినీటితో షవర్ చేయకపోవడమే మంచిది.

స్నానం తర్వాత కూడా చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. పుష్కలంగా నీటిని తాగాలి.

హోలీ తర్వాత చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేస్తే స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.