పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో చాలామంది మెహెందీ ఎక్కువగా పెట్టుకుంటారు.

ఆ సమయంలో చేతులు ఎర్రగా పండితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది.

అందుకే మెహెందీ పెట్టుకున్న తర్వాత కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఎర్రగా పండుతుంది.

నిమ్మరసాన్ని, పంచదార సమానంగా తీసుకుని.. మెహెందీ మీద అప్లై చేస్తే మంచి రంగు వస్తుంది.

మెహెందీ ఆరిపోయిన తర్వాత కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాస్తే మెహెందీ ఇంకా ఎర్రగా మారుతుంది.

మెహెందీ పెట్టుకున్నప్పుడు ఘాటైన కెమికల్స్ ఉండే ప్రొడెక్ట్స్ వాడకపోవడమే మంచిది.

మెహెందీ ఎప్పుడు హై క్వాలిటీ అయితే మంచిగా పండుతుంది. ఎలాంటి అలెర్జీ రాదు.

ఎక్కువసేపు ఎండలో ఉంటే కూడా మెహెందీ రంగు త్వరగా పోతుంది.

మెహెందీ తీసిన వెంటనే చేతులు కడుక్కుంటే రంగు పోతుంది. కాబట్టి కాస్త వెయిట్ చేస్తే మంచిది.