జుట్టు రాలే సమస్య ఉన్నవారు గుడ్డును అప్లై చేస్తే ఎన్నో లాభాలు పొందవచ్చట. గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును రిపైర్ చేసి.. దృఢంగా చేస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ ఉంటాయి. జుట్టును మాయిశ్చరైజ్ చేసి మంచి కండీషన్‌ను అందిస్తాయి. ఫ్రిజ్జీ హెయిర్ ఉన్నవారు జుట్టుకు షైన్ కావాలనుకున్నా, స్మూత్‌నెస్ కావాలనుకున్న దీనిని అప్లై చేయవచ్చు. హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేయడంలో బయోటిన్, బి-కాంప్లెక్స్ హెల్ప్ చేస్తాయి. గుడ్డులోని ఎంజైమ్స్ పాడైన జుట్టును రిపైర్ చేసి.. జుట్టు బ్రేక్ కాకుండా, స్ప్లిట్ ఎండ్స్ లేకుండా చేస్తాయి. చుండ్రు, దురదతో ఇబ్బంది పడేవారు ఎగ్ మాస్క్‌ని అప్లై చేస్తే మంచి ఫలితాలు చూస్తారు. మీ జుట్టు పొడుగు, ఒత్తును బట్టి ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకుని దానిలో కొబ్బరి లేదా ఆలివ్ నూనె వేయాలి. కుదుళ్ల నుంచి జుట్టుకు ఈ మాస్క్‌ను అప్లై చేసి.. పావు గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికోసారి లేదా నెలలో మూడుసార్లు కూడా దీనిని అప్లై చేయవచ్చు.