చాలామంది మేకప్ వేసుకుంటారు కానీ.. మేకప్ బ్రష్​లను ఎలా ఉపయోగించాలో తెలీదు.

కానీ కొన్ని పరిశోధనల ప్రకారం మేకప్ బ్రష్​లను సరిగ్గా క్లీన్ చేయకుంటే.. టాయిలెట్​ మీద కంటే ఎక్కువ బాక్టీరియా ఉంటుందట.

కాబట్టి మేకప్ చేసుకునే ముందు.. చేతులను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ముఖంపైకి బ్యాక్టీరియా వ్యాపించదు.

మీరు ఎంచుకునే ప్రొడెక్ట్​కి సరిపడా బ్రష్​ని ఎంచుకోవాలి. ఇది కచ్చితంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

రెగ్యులర్​గా బ్రష్​లను క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల బ్యాక్టీరియా ముఖంపై వ్యాపించదు.

ప్రొడక్ట్​ని బ్రష్​తో గట్టిగా కాకుండా.. కాస్త సుకుమారంగా మౌల్డ్ చేయాలి. అప్పుడే అది కరెక్ట్​గా అప్లై అవుతుంది.

మేకప్​ని ఎప్పుడు ఫేస్ మధ్యభాగం నుంచి అప్లై చేస్తూ ఉండాలి. దీనివల్ల సమానంగా మేకప్​ని అప్లై చేయవచ్చు.

లైట్, జెంటిల్ స్ట్రోక్స్ ఇస్తే కవరేజ్ బాగుంటుంది. దీనివల్ల బ్రష్​తో మేకప్​ వేసుకోవడం ఈజీగా ఉంటుంది.

బ్రష్​తో మేకప్​ని వీలైనంత బ్లెండ్ చేయాలి. ఎంత బాగా బ్లెండ్ చేస్తే స్కిన్ అంత అందంగా మారుతుంది.