నీళ్లు తక్కువ తాగితే జుట్టు ఎక్కువ రాలిపోతుందా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

జుట్టు రాలడం

జుట్టు రాలడం అనేది చాలామందికి సాధారణ సమస్యగా మారింది. యువకుల నుంచి వృద్ధుల వరకు దాదాపు అందరూ జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నవారే.

Image Source: PEXELS

చర్మంలాగే సంరక్షణ అవసరం

చర్మానికి పోషణ, తేమ ఎంత అవసరమో.. జుట్టుపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపడం అంతే అవసరం. తగినంత తేమను అందించకపోతే అది జుట్టు బలం, మెరుపుపై నేరుగా ప్రభావం చూపిస్తుంది.

Image Source: PEXELS

లైఫ్ స్టైల్

మీ జీవనశైలిలోని అలవాట్లు, తీసుకునే ఆహారం మీ జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి వల్ల జంక్ ఫుడ్ తినడం, క్రమరహిత నిద్ర అనేవి జుట్టును బలహీనపరుస్తాయి.

Image Source: PEXELS

డీహైడ్రేషన్ వల్ల జుట్టు రాలుతోందా?

చాలామంది తక్కువ నీరు తాగడం వల్ల జుట్టు రాలుతుందా అని ఆలోచిస్తారు. దీనికి సమాధానం అవుననే అంటున్నారు నిపుణులు. నిర్జలీకరణం జుట్టు పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Image Source: PEXELS

నిపుణుల అభిప్రాయం ఇదే

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిర్జలీకరణం శరీరంలో పోషకాలను సరిగ్గా సరఫరా చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. జుట్టు రాలడాన్ని వేగవంతం చేస్తుంది.

Image Source: PEXELS

హైడ్రేషన్ ఎందుకు అవసరం..

మీరు తగినంత నీరు తాగనప్పుడు మీ శరీరం, తలపై చర్మం డీహైడ్రేషన్​కి గురిచేస్తాయి. ఇవి మీ జుట్టులో తేమ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది పొడిగా, పెళుసుగా, విరిగిపోయేలా చేస్తుంది.

Image Source: PEXELS

రక్త ప్రసరణ, జుట్టు పెరుగుదల

సరిగ్గా నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఇది తలకు పోషకాలను అందిస్తుంది. నీరు లేకపోతే, జుట్టు కుదుళ్లకు బలంగా ఉండటానికి తగినంత పోషణ అందదు.

Image Source: PEXELS

జుట్టు ఆరోగ్యానికై

మీ జుట్టు స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి తేమ చాలా అవసరం. తగినంత తేమ లేకపోవడం వల్ల సహజమైన మెరుపు తగ్గిపోతుంది. జుట్టు దెబ్బతినే అవకాశం ఉంది.

Image Source: PEXELS

తక్కువ నీరు తాగితే

మీరు తక్కువ నీరు తాగడం కొనసాగిస్తే మీ జుట్టు మూలాల నుంచి బలహీనంగా మారుతుంది. చివరికి జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కారణమవుతుంది.

Image Source: PEXELS

ఎంతనీరు తాగాలి..

ఆరోగ్యకరమైన జుట్టు కోసం నిపుణులు రోజుకు కనీసం 7–8 గ్లాసుల నీరు తాగాలని సూచిస్తున్నారు. ఇది మీ తలపై చర్మాన్ని తేమగా ఉంచుతుంది. జుట్టు రాలకుండా చేస్తుంది.

Image Source: PEXELS