ఐశ్వర్య రాయ్ రెడ్ కార్పెట్ లుక్స్​కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది.

కేన్స్ ఫెస్టివల్ జరుగుతున్న నేపథ్యంలో అందరూ ఐశ్వర్య లుక్స్​ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

2015లో ఐశ్వర్య రెడ్ వైన్ గౌన్​లో రెడ్​ కార్పెట్​పై కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

లావెండర్ కలర్ లిప్​స్టిక్ వేసుకుని అందరినీ షాక్​కి గురిచేసి ఫ్యాషన్​కి కొత్త అర్థం చెప్పింది.

2017లో భారీ గౌన్​తో డీప్​ నెక్​తో రెడ్ కార్పెట్​పై ఫోజులిచ్చింది.

2018లో బటర్​ఫ్లై ఫార్మెట్ డ్రెస్ ధరించి సూపర్ స్టన్నింగ్​గా కనిపించింది.

2019లో గోల్డెన్ మెటాలిక్ గౌన్ ధరించి అందంగా కనిపించింది ఐశ్వర్య. ​

2022లో ఐశ్వర్య నల్లటి గౌన్​ని రంగు రంగుల పూలతో గ్రాండ్​ లుక్​ వచ్చేలా ముస్తాబైంది.

రెడ్ వెడ్డింగ్ గౌన్​లో డార్క్ లిప్​ షేడ్​తో రెడ్ కార్పెట్​పై ఫోజులిచ్చి ఎన్నో ప్రశంసలు అందుకుంది.

స్టైల్​కి కొత్త అర్థం చెప్తూ.. వయసు మీద పడినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య.

ఇప్పటికీ ఆమె లుక్స్​ని ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా ఉత్తమమైనవిగా చూస్తారు.