సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అందాల భామ సదా, తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బ్లూ స్కర్ట్ లో అందాలు ఆరబోస్తోంది. 'జయం' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సదా అలియాస్ సదాఫ్ మొహమ్మద్ సయీద్. అచ్చ తెలుగమ్మాయిగా లంగా ఓణీలో కనిపించి తొలి చిత్రంతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది. 'వెళ్లవయ్యా వెళ్ళూ' అంటూ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్న సదా, ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఓవైపు ‘నాగ’లో ఎన్టీఆర్ సరసన నటిస్తూనే మరోవైపు బాలకృష్ణ కు జోడిగా ‘వీరభద్ర’ సినిమాలో నటించింది. ‘జయం’తో పాటు ‘అపరిచితుడు’ 'ఔనన్నా కాదన్నా', 'దొంగ దొంగది' సినిమాలు అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన సదా.. ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.