షవర్మాను చాలామంది మంచి స్నాక్‌గా తీసుకుంటారు. కానీ అది పూర్తిగా అనారోగ్యకర ఫ్యాటీ యాసిడ్లతో నిండి ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెంచి గుండె జబ్బులకు కారణమవుతుంది. చెడు కొవ్వును పెంచి.. బరువు పెరిగేలా చేస్తుంది. కొందరిలో వాంతులు, వికారం, డయోరియా సమస్యలు కలిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు షవర్మా తింటే వారిలోని చక్కెర నిల్వలు అమాంతం పెరుగుతాయి. ఇటీవలె షవర్మా తినడం వల్ల కొందరికి ఫుడ్ పాయిజన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. షవర్మా తిన్నప్పుడు మీకు ఇలాంటి పరిస్థితులు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.