యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గ్రీన్‌టీలో పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఎప్పుడుపడితే అప్పుడు తాగకూడదు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కాదు కదా.. నష్టాలు వస్తాయి. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే వికారం కలుగుతుంది. మోతాదుకు మించి గ్రీన్ టీ తాగడం అస్సలు మంచిది కాదు. రాత్రుళ్లు గ్రీన్ టీ తాగితే.. దానిలోని కెఫిన్ మీకు నిద్రను దూరం చేస్తుంది. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగడం వల్ల రక్తహీనత వస్తుందట. ఒకసారి వాడిన గ్రీన్ టీ బ్యాగ్‌లు మరోసారి ఉపయోగించకపోవడమే మంచిది. (Image Source : Pexels)