మోనోపాజ్ సమయంలో శారీరక మార్పులు ఎక్కువగా ఉంటాయి. రాత్రుళ్లు చెమటలు పట్టడం, యోని పొడిబారడం వంటి మార్పులు ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రారన్ ఉత్పత్తి వల్ల హార్మోన్లలో హెచ్చు తగ్గులు సంభవిస్తాయి. ఇది లైంగిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. లిబిడోను తగ్గించి.. యోనిలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రుతువిరతి అనేది మానసిక శ్రేయస్సుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే మోనోపాజ్ సమయంలో ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. జీవన శైలిలో మార్పులు, వైద్యుల సూచనలతో మీరు వీటిని జయించవచ్చు. (Image Source : Pexels)