తెలిసీ తెలియక కొన్ని అలవాట్లు అలా జీవితంలో కొనసాగిస్తుంటాము. కానీ కొన్ని అలవాట్లు తీవ్రమైన నష్టం చేస్తాయి.

ఆరోగ్యానికి శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం అవసరం. ఇందుకు తగినన్ని నీళ్లు తాగడం అవసరం.

తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరంలో వేడి పెరగడం నుంచి, చర్మం, కీళ్లు, జీర్ణ, విసర్జన వ్యవస్థ ఇలా ప్రతి వ్యవస్థ అనారోగ్యానికి గురికావచ్చు.

ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే విషయాలతో పాటు ఎప్పుడు తింటున్నామనేది కూడా ముఖ్యమే.

ముఖ్యంగా రాత్రి భోజనం ఆలస్యంగా చేసేవారు అసిడిటి నుంచి ఊబకాయం వరకు రకరకాల అనారోగ్యాల బారిన పడతారు.

ఆహారం నీరు నిద్రతో పాటు తగినంత వ్యాయామం చాలా ముఖ్యం. శారీరక, మానసిక ఆరోగ్యాలకు వ్యాయామం తప్పనిసరి.

తగినంత వ్యాయామం లేకపోతే ఎముకలు, కండరాలు బలహీనపడతాయి, బరువు పెరుగుతారు.

పరధ్యానంగా ఆహారం తీసుకోవడం కూడా అనారోగ్యాలకు దారితీస్తుందట. తిండిమీద పూర్తి శ్రద్ధతో తినాలని నిపుణుల సూచన.

వర్కవుట్ మాదిరిగా నిద్ర కూడా చాలా ముఖ్యం. తగినంత విశ్రాంతి లేకపోతే ఆరోగ్యం చాలా రకాలుగా పాడవుతుంది.

బీపీ, కేసిడి, డయాబెటిస్, స్ట్రోక్, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలకు చాలినంత నిద్ర లేకపోవడం కూడా ఒక కారణం.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels