హార్మోన్ల మార్పులు, గర్భధారణ సమయంలో, పీసీఓఎస్, హైపోథైరాయిడిజం వల్ల చర్మం మీద మొటిమలు, పిగ్మెంటేషన్ కి గురవుతుంది.



మొటిమలు, నల్లని మచ్చలు ఏర్పడటానికి మెలనిన్ తక్కువగా ఉత్పత్తి అవడం కూడా మరొక కారణం.



చర్మం మీద గాయాలు అయినా కూడా అవి తగ్గిన తర్వాత మచ్చలుగా ఏర్పడిపోతాయి.



తగినంతగా నీరు తాగకపోతే చర్మం పొడిబారిపోతుంది. అప్పుడు కూడా చర్మం మీద డార్క్ ప్యాచ్ లు ఎక్కవగా ఉంటాయి.



కొన్ని రకాల మందులు వేసుకోవడం వల్ల వాటి దుష్ప్రభావాల వల్ల కూడా నల్లటి మచ్చలు మొహం మీద పడిపోతాయి.



మొహం మీద ఏర్పడిన నల్లటి మచ్చలు పోగొట్టుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే అందంగా మారిపోతారు.



చందన్, కొబ్బరి, నల్పమరది, కుంకుమడి వంటి ఆయుర్వేద మూలికలతో కూడిన నూనెలతో మసాజ్ చెయ్యడం వల్ల మచ్చలు తగ్గుతాయి.



టొమాటో పేస్ట్ 20 నిమిషాల పాటు ముఖానికి రాసుకుని కడుక్కోవాలి. ఇందులోని లైకోపీన్ యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.



పెరుగు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కలిపిన మిశ్రమం ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. నల్ల మచ్చలు తొలగిస్తుంది.



మసూర్ పప్పు నీటిలో నానబెట్టి మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ ముఖానికి అప్లై చేసుకోవాలి. పిగ్మెంటేషన్ పొగుడుతుంది.



క్రమం తప్పకుండా సన్ స్క్రీన్ రాసుకోవాలి. యూవీ రేడియేషన్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.