పుసుపుతో చేసిన టీ ఇమ్యూనిటి పెంపొందించే, శరీరంలో నుంచి టాక్సిన్స్ బయటకు పంపించే ఇంటి చిట్కా.

పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుంది.

అల్లంలో ఉండే వేడిచేసే తత్వం ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. తేనే గొంతును మృదువుగా చేస్తుంది.

అందుకే అల్లం, తేనె కలిపి చేసిన అల్లం టీ సీజనల్ గా వేధించే ఫ్లూ వంటి వాటి నుంచి కాపాడుతుంది.

లవంగాలు, మిరియాలు, దాల్సిని, అల్లం తులసి, పసుపు కలిపి చేసే కాఢా అని పిలిచే కషాయం ఇమ్యూనిటి పెంచుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ జీర్ణవ్యవస్థలో మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది. అందువల్ల నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

కణజాలాలను కాపాడే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ సితో నిమ్మ చాలా ఆరోగ్య ప్రదాయని.

లెమన్ టీ తరచుగా తీసుకుంటే సాధారణంగా జలుబు వంటి ఇన్ఫెక్షన్లు కలగకుండా నివారిస్తుంది.

తులసి కేవలం ఇమ్యూనిటి పెంచడం మాత్రమే కాదు, ఇన్ఫ్లమేషన్లు రాకుండా నివారిస్తుంది. శ్వాసవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.



Representational Image : Pexels