అరటిపండు - పాలు కలిపి తినొద్దంటున్న ఆయుర్వేదం

బ్రేక్ ఫాస్ట్‌లో ఎక్కువ మంది గ్లాసుడు పాలు, ఒక అరటి పండు తినేసి... అయిపోయిందనుకుంటారు.

ఆయుర్వేదం ప్రకారం ఆ రెండూ కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.

పాలల్లో కాల్షియం, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, బి విటమిన్లు అధికంగా ఉంటాయి.

అరటిపండులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. విడి విడిగా తింటే ఇవి చాలా మేలు చేస్తాయి.

కలిపి తినడం వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది.

శ్వాస సమస్యలు, అలెర్జీలు, ఆస్తమా ఉన్నవారికి సమస్య పెరుగుతుంది.

శరీరంపై దద్దుర్లు రావచ్చు.

సైనస్, అజీర్తి, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.