విశ్రాంతి సమయంలో గుండె కూడా రిలాక్స్ అవుతుంది.

రోజూ 7 నుంచి 8 గంటల నిద్రపోతే వల్ల గుండెకు తగిన విశ్రాంతి లభించి సమర్థంగా పనిచేస్తుంది.

రాత్రి వేళల్లో సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.

సరైన సమయంలో నిద్రించకపోతే శరీరం నుంచి టాక్సిన్ల విడుదల సక్రమంగా జరగదు. ఇది గుండెపై ప్రభావం చూపుతుంది.

సరైన స్లీప్ ప్యాటర్న్ లేని వారిలో గుండె సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అస్థిరమైన స్లీప్ ప్యాటర్న్ ఉన్న వారిలో రక్తనాళాల్లో ప్లేక్ చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

డిజిటల్ స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉన్నవారిలో సిర్కాడియన్ రిథమ్ కి అంతరాయం కలిగి నిద్ర లేమికి గురవుతారు.

ముక్కు నుంచి గాలి పీల్చుకుని నోటి ద్వారా బయటకు వదులుతూ చేసే ప్రాణాయామంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది.

క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం లేదా యోగ సాధన ద్వారా నిద్రలేమిని జయించవచ్చు.

బాలాసనం, పశ్చిమోత్తనాసనం, భుజంగాసనం, పర్వతాసనం వంటివి నిద్రకు ఉపకరిస్తాయి.

ఫైబర్, ప్రొటీన్, మినరల్స్ , విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి.
Representational Image : Pexe