ఉప్పు డబ్బాను దూరం పెట్టండి

భోజనం అంటే అందులో సరిపడినంత ఉప్పు ఉండాలి. తగ్గితే చాలు పైన ఉప్పు చల్లుకుని తినేస్తారు.

ఇలా ఉప్పును చల్లుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యసమస్యలు వస్తాయని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

అందుకే భోజనం తినేటప్పుడు ఉప్పు డబ్బాను దగ్గర్లో ఉంచుకోకండి.

దాదాపు 1,76,750 మందిపై అధ్యయనం నిర్వహించారు.

వీరిలో అదనంగా అన్నంలో ఉప్పు వేసుకుని కలుపుకుని తింటున్న 7000 మందికి గుండె పోటు వచ్చినట్టు తేలింది.

మరో రెండు వేల మంది పక్షవాతం బారిన పడినట్టు గుర్తించారు.

వండేటప్పుడు కాకుండా తినేటప్పుడు అదనంగా ఉప్పు చల్లుకునేవారిలో గుండె జబ్బులు, అధికరక్త పోటు అధికంగా ఉన్నట్టు చెప్పారు పరిశోధకులు.

అందుకే ఉప్పు డబ్బాను దూరంగా ఉంచడం ఉత్తమం.