అవికా గోర్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన లేటెస్ట్ సినిమా పాప్‌కార్న్ ట్రైలర్ లాంచ్‌లో అవికా ఈ అవుట్‌ఫిట్‌లోనే పాల్గొంది. అక్కినేని నాగార్జున ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సినిమాలో సందీప్ శర్మ హీరోగా నటించాడు. పాప్ కార్న్‌కు అవికా గోర్ నిర్మాత కూడా. బాలికా వధు సీరియల్‌తో అవికా గోర్ చాలా ఫేమస్ అయింది. ఈ సీరియల్ తెలుగులో ‘చిన్నారి పెళ్లి కూతురు’ పేరుతో డబ్ అయింది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్‌గా ‘థ్యాంక్యూ’ సినిమాలో కూడా కనిపించింది. Image Credits: Avika Gor Instagram