ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ అంటే ఏమిటి?

Published by: Khagesh
Image Source: pinterest

ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ అనేది ఒకే ఇంధన ట్యాంక్‌లో పెట్రోల్, ఇథనాల్ వివిధ రకాల మిశ్రమాలతో నడపగలిగేలా ప్రత్యేక సాంకేతికతతో రూపొందించిన వాహనం.

Image Source: pinterest

సాధారణ బైకులు కేవలం 100% పెట్రోల్ లేదా చాలా తక్కువ శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతో మాత్రమే నడుస్తాయి.

Image Source: pinterest

కానీ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకులు E20 నుంచి E85 అంటే 85% ఇథనాల్, 15% పెట్రోల్ వరకు ఎలాంటి మిశ్రమ ఇంధనాన్ని అయినా సమర్థవంతంగా వినియోగించుకోగలవు.

Image Source: pinterest

ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకులలో ఉండే ఒక ప్రత్యేక ఫ్యూయల్ కంపోజిషన్ సెన్సార్ ట్యాంక్‌లో ఎంత శాతం ఇథనాల్ ఉందో నిరంతరం గుర్తిస్తుంది.

Image Source: pinterest

ఆ డేటా ఆధారంగా ఇంజన్‌లోని ఆటోమేటెడ్ ECU ఇంధనం ఇంజెక్షన్ అయ్యే మోతాదును, స్పార్క్ టైమింగ్‌ను ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది.

Image Source: pinterest

భారత మార్కెట్లో ఇప్పటికే హీరో మోటోకార్ప్ తన పాపులర్ మోడల్స్ అయిన స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, HF డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ విడుదల చేసింది.

Image Source: pinterest

హోండా సంస్థ CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మోడల్స్‌ను ఇథనాల్ ఇంధన సామర్థ్యంతో అందుబాటులోకి తెచ్చింది.

Image Source: pinterest

ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకుల వల్ల ఇంధన ఖర్చులు భారీగా తగ్గుతాయి.

Image Source: pinterest

ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకుల వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది.

Image Source: pinterest