ఒక క్లాసిక్ 350 బైక్ ట్యాంక్ నింపాలంటే ఏపీలో ఎంత ఖర్చు ? టీజీ లో ఎంత ఖర్చు ?

Published by: Jyotsna

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 చాలా మందికి డ్రీమ్ బైక్.

క్లాసిక్ డిజైన్, శక్తివంతమైన పనితీరు కారణంగా యూత్ ఈ బైక్ ను బాగా లైక్ చేస్తారు.

ఈ బైక్ ట్యాంక్ లో 13 లీటర్ల పెట్రోల్ పడుతుంది. 455 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

ఈ రోజుకి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ₹107.66

ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో పెట్రోల్ ధర ₹109.76 గా ఉంది.

ఈ ధరల ఆధారంగా, పూర్తి ట్యాంక్ నింపడానికి ఖర్చు

హైదరాబాద్‌లో: 13 లీటర్లు × ₹107.66/లీటర్ = ₹1,399.58

విజయవాడలో: 13 లీటర్లు × ₹109.76/లీటర్ = ₹1,426.88