లగ్జరీ కార్ల గురించి మాట్లాడినప్పుడల్లా రోల్స్ రాయల్స్ పేరే ముందు వస్తుంది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ suv కార్ లలో కూడా ఇదే ముందు ఉంటుంది.

రోల్స్-రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ అనేది ప్రీమియం లగ్జరీ SUV మోడల్.

ఇది సాధారణ కల్లినన్ కంటే మరింత పవర్‌ఫుల్, స్టైలిష్, మరియు ఎక్స్‌క్లూజివ్ వెర్షన్.

ఈ కారు మన దేశంలో ఇప్పటివరకు నలుగురి దగ్గర మాత్రమే ఉంది.

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ మన దేశంలో రోల్స్-రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ కారు కొన్నవారిలో ముందున్నాడు.

మరో కారు ముకేష్ అంబానీ దగ్గర ఉంది.

మరో కారు ముంబైకి చెందిన మహిళా పారిశ్రామిక వేత్త వ్రతికా గుప్తా దగ్గర ఉంది.

ఇంకో కారును హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ కలిగి ఉన్నారు.