మీ కారు సర్వీసింగ్‌కి ఇచ్చేటప్పుడు కొన్ని టిప్స్ పాటించండి. కారును సమయానికి సర్వీసింగ్ చేయిస్తే దాని జీవితకాలం పెరుగుతుంది. కారులో విడి భాగాలు ఏవైనా పాడైతే సర్వీసింగ్ సమయంలో తెలుస్తుంది. సర్వీసింగ్ సమయంలో మంచి ఆయిల్ ఫిల్టర్‌ను పెట్టించాలి. సర్వీసింగ్ చేసేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఎయిర్ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. స్పార్క్ ప్లగ్‌ను కూడా క్లీన్ చేయించాలి. బ్రేకులు, లైట్లను కూడా పూర్తి స్థాయిలో చెక్ చేయించాలి. కారు సర్వీసింగ్ చేసేటప్పుడు టైర్లను కూడా చెక్ చేయిస్తూ ఉండాలి. సర్వీసింగ్ పూర్తయ్యాక విడి భాగాలు గట్టిగా టైట్ చేయించాలి.