రంగులు మార్చే కారు ఒకటుందని మీకు తెలుసా? బీఎండబ్ల్యూ ఇటువంటి కారును రూపొందించే పనిలో ఉంది. దీనికి బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో అని పేరు పెట్టారు. కళ్లు మూసి తెరిచేంతలో ఈ కారు రంగులు మార్చేయగలదు. ఈ కారు తయారీలో ఎలక్ట్రిక్ పేపర్ డిస్‌ప్లే (ఈపీడీ)ని ఉపయోగించనున్నారు. ఈపీడీలో మనిషి వెంట్రుకల కంటే పలుచని మైక్రో క్యాప్యూల్స్ ఉంటాయి. కారులో ఒక బటన్‌ను నొక్కడం ద్వారా కారు బ్లాక్ నుంచి వైట్‌గా మారిపోతుంది. మూడు రంగుల్లోకి ఈ కారు మారగలదు. బ్లాక్, వైట్, గ్రే రంగులకు ఈ కారు మారగలదు. ఈ కారు ఎప్పుడు లాంచ్ కానుందో మాత్రం తెలియరాలేదు.