మనదేశంలో కారు ప్రియలకు వాటి చరిత్రపై కూడా అంతో ఇంతో ఆసక్తి ఉంటుంది. కారు కొనడం అనేది అందరికీ సులభమైన విషయం కాదన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కారు కొనడం, దాన్ని మెయింటెయిన్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. భారతదేశంలో మొదటి కారు కొన్నది ఎవరో మీకు తెలుసా? మనదేశంలో మొట్టమొదటి కారును 1897లో దిగుమతి చేశారు. ఈ కారును ఫాస్టర్ అనే ఆంగ్లేయుడు కొనుగోలు చేశాడు. క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీ యజమానే ఈ ఫాస్టర్. అయితే తర్వాతి సంవత్సరంలోనే జంషెడ్జీ టాటా కూడా ఒక కారును కొనుగోలు చేశారు. కారును కొనుగోలు చేసిన మొదటి భారతీయుడిగా ఆయన నిలిచారు. డెడియన్ కంపెనీకి చెందిన కారును ఆయన కొనుగోలు చేశారు.