రూ.లక్షలోపే బజాజ్ పల్సర్ - అత్యంత చవకైన మోడల్ ధర ఎంత? బజాజ్ పల్సర్ మనదేశంలోనే మోస్ట్ పాపులర్ బైక్స్‌లో ఒకటి. ముఖ్యంగా యువతలో ఈ బైక్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ బైక్ తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉంది. రూ.లక్షలోపు ధరకే ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ చాలా స్పోర్టీ డిజైన్‌తో మార్కెట్లో లాంచ్ అయింది. బ్లాక్ కలర్ అలోయ్ వీల్స్‌ను ముందు, వెనకవైపు ఉపయోగించారు. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్న ఇంజిన్‌ను ఈ పల్సర్‌లో అందించారు. ఈ బైక్ 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11.5 లీటర్లుగా ఉంది. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 550 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.