మహీంద్రా థార్ రోక్స్ లీటరు పెట్రోలుకు ఎంత మైలేజీని ఇస్తుంది? ఆగస్టు 15వ తేదీన మహీంద్ర థార్ రోక్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దానికి సంబంధించిన బుకింగ్స్ కూడా తర్వాత ప్రారంభం అయ్యాయి. బుకింగ్స్ ప్రారంభం అయిన గంటలోనే 1.76 లక్షల బుకింగ్స్ కావడం విశేషం. మహీంద్రా థార్ రోక్స్ మైలేజీ... వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది. కొత్త మహీంద్రా థార్ రోక్స్ 12.4 కిలోమీటర్ల నుంచి 15.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో పెట్రోల్ వేరియంట్ 12.4 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది. పెట్రోల్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లు రెండూ అదే మైలేజీని అందిస్తాయి. మహీంద్రా థార్ రోక్స్ ధర రూ.12.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.22.49 లక్షలుగా ఉంది.