Hero Splendor Plus Flex Fuelలో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి?

Published by: Khagesh

హీరో స్ప్లెండర్ పర్యావరణహితంగా స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ తీసుకొచ్చింది.

ఇథనాల్ మిశ్రమంతో నడిచే స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఒకే ఒక్క వేరియంట్‌ తీసుకొచ్చింది.

హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ STD ఎక్స్-షోరూమ్ ధర ₹82,810గా ఉంది.

ఈ సరికొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ సిస్టమ్‌ను మార్కెట్లోకి టెస్ట్ చేయడానికి, కస్టమర్లకు బెస్ట్ ఫీచర్లు ఒకే చోట అందించడానికి ఒకే వేరియంట్‌ పరిచయం చేసింది.

ఈ వేరియంట్‌లో స్టైలిష్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తోపాటు, డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి. డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు.

ఇందులో రీ-డిజైన్ చేసిన అనలాగ్-డిజిటల్ కంబైన్డ్ కన్సోల్ ఉంది.

దీని కుడి వైపున ప్రత్యేకంగా Flex Fuel ఎంబ్‌లమ్, i3S లైట్, న్యూట్రల్ లైట్, సైడ్ స్టాండ్ సెన్సార్, ఇకో-రైడింగ్ ఇండికేటర్ ఉంటాయి.

ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బైక్ ఐడిల్‌గా ఉన్నప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి, క్లచ్ నొక్కగానే ఆన్ అవుతుంది.

ఇది ప్రస్తుతానికి ప్రత్యేకమైన బ్లాక్ విత్ లైమ్ ఎల్లో అనే సింగిల్ డ్యూయల్-టోన్ కలర్ గ్రాఫిక్స్‌తో మాత్రమే లభిస్తుంది.