రూ.కోటిన్నర విలువైన కొత్త కారు కొన్న ‘ఖిలాడీ’ - దాన్ని ప్రత్యేకతలు ఏంటి? బాలీవుడ్ జనాలు ముద్దుగా ‘ఖిలాడీ’ అనే పిలుచుకునే అక్షయ్ కుమార్ కొత్త కారు కొనుగోలు చేశారు. రూ.కోటిన్నర్ విలువైన టయోటా వెల్‌ఫైర్‌ను అక్షయ్ కుమార్ కొనుగోలు చేశారు. అక్షయ్ కుమార్ తన కొత్త సిల్వర్ కలర్ వెల్‌ఫైర్‌లో ముంబై ఎయిర్ పోర్టు వద్ద కనిపించారు. కంఫర్టబుల్ రైడ్ కోసం ఈ కారును డిజైన్ చేశారు. టయోటా వెల్‌ఫైర్‌లో బాక్సీ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను అందించారు. ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లను అందించారు. చాలా మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఏకంగా 60 కనెక్టెడ్ కార్ ఫీచర్లను టయోటా వెల్‌ఫైర్‌లో అందించారు. ఇందులో చాలా హై ఎండ్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా చూడవచ్చు. ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లను ఇందులో అందించారు.