ఉగాది 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు!
గ్రహబలం, దైవబలం , మీ ఆత్మవిశ్వాసం అన్నీకలపి అడుగుపెట్టిన ప్రతిచోటా విజయం మీదే అవుతుంది
ఉగాది తర్వాత మూడు నెలల పాటూ చికాకులున్నా ఆ తర్వాత రోజులన్నీ మంచి ఆదాయం, ఆనందం మీ సొంతం
కొంతకాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యగులకు ప్రమోషన్లు తథ్యం
మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక పదవి లభిస్తుంది. అయితే రాహువు ప్రతికూల ప్రభావం వల్ల ప్రశాంతంగా ఉండలేరు
టీవీ, సినిమా రంగాల్లో ఉండేవారికి మంచి అవకాశాలు, ఆదాయం ఉంటుంది. అవార్డులు సాధిస్తారు
రానిబాకీలు వచ్చేస్తాయి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. ఎప్పటి నుంచో పొందాలి అనుకున్న కాంట్రాక్టులకు సైన్ చేస్తారు
గురుబలం ఉండడంత పరీక్షలు బాగా రాస్తారు. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.
ఈ ఏడాది తులా రాశివారికి రెండు పంటలు లాభాన్నిస్తాయి. అవసరమైన సమయంలో ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది
రాహు గ్రహ సంచారం కారణంగా చికాకులున్నా గురు గ్రహం అండగా నిలిచి మంచి చేస్తాడు