ఉగాది 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు!
శ్రీ విశ్వావసు నామసంవత్సరం కన్యా రాశివారికి శని, గురుడు బలంగా ఉన్నారు..
మీరున్న రంగంలో అద్భుతంగా రాణిస్తారు, పెద్ద పెద్ద సమస్యలను కూడా సులువుగా దాటేస్తారు
వ్యక్తిగత జీవితలో సంతోషం, స్నేహితుల సహకారం, కోర్టు కేసులలో ఉండేవారికి ఉపశమనం లభిస్తుంది
ఈ ఏడాది ఉద్యోగులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్, నచ్చిన ప్రదేశానికి బదీలులు ఉంటాయి
రాజకీయాల్లో ఉండేవారి ఎదురుచూపులు ఫలిస్తాయి. డబ్బు భారీగా ఖర్చు అయినా కానీ ఫలితం దక్కుతుంది
ఎందులో పెట్టుబడి పెట్టినా కలిసొస్తుంది. భాగస్వామ్య వ్యాపారులు కొంత అప్రమత్తంగా ఉండాలి
కన్యా రాశి విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు మంచి సీట్లు పొందుతారు
రెండు పంటలూ లాభాన్నిస్తాయి. అప్పులు తీరిపోతాయి ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు
గతేడాది కన్నా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యారాశివారికి శుభఫలితాలే ఉన్నాయి