మిథున రాశి వార్షిక ఫలితాలు @ 2025

2025 లో మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి

Published by: RAMA

జనవరి 2025

ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడులు కలసిరావు. సలహాలు స్వీకరించకుండా కొత్త ప్రణాళికలు అమలు చేయవద్దు. షేర్ మార్గెట్ కు దూరంగా ఉండండి.

ఫిబ్రవరి 2025

ఈ నెలలో వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఆఫర్లు పొందుతారు. కళారంగంతో సంబంధం ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు

మార్చి - ఏప్రిల్ 2025

మిథున రాశి వారు మార్చి, ఏప్రిల్ నెలల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జీవితం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. నూతన పెట్టుబడులు వద్దు

మే 2025

మే నెలలో మీరు జీవితంలో చాలా మార్పులు చూస్తారు. ఈ నెలలో గురుగ్రహం రెండుసార్లు మీ రాశిలో ప్రవేశిస్తుంది

జూన్ 2025

ఈ నెలలో వైవాహిక జీవితంలో ఆందోళనలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రణాళికలు అమలుచేయడంలో జాగ్రత్తగా వ్యవహరించండి

జూలై - ఆగష్టు 2025

ఈ నెల మిథున రాశివారికి సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక లాభం ఓవైపు పెరిగే ఖర్చులు మరోవైపు ఉంటాయి. ఆగష్టులో ఆర్థిక లాభం ఉంటుంది.

సెప్టెంబర్ - అక్టోబర్ 2025

ఈ 2 నెలల్లో మిథునరాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది.

నవంబర్ 2025

ఈ నెలలో ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసేందుకు మిథున రాశివారు ప్లాన్ చేసుకుంటారు. మీ ప్రణాళికలు అమలుచేస్తారు

డిసెంబర్ 2025

డిసెంబర్ మీకు ఒత్తిడితో కూడినది అవుతుంది. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వైవాహిక జీవితంలో కలతలు తొలగించుకునేందుకు ప్రయత్నించండి