ఉగాది పంచాంగం 2025-2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ధనస్సు రాశి ఫలితాలు!

Published by: RAMA

గురుబలం ఉంది

ఇంటా బయటా గౌరవం ఉంటుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, రాజకీయాల్లో మంచి స్థితిలో ఉంటారు. దైవబలంతో పాటూ గ్రహబలం కలిసొస్తుంది

ఉద్యోగులకు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త వింటారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారి జీతం పెరుగుతుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు

రాజకీయనాయకులకు

వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు విశేష యోగం. ఆశించిన పదవి లభిస్తుంది..డబ్బు మాత్రం భారీగా ఖర్చవుతుంది

కళాకారులకు

కళాకారులకు మంచి అవకాశాలు, అవార్డులు , రివార్డుల లభిస్తాయి. ఆదాయం , గౌరవం పెరుగుతుంది

వ్యాపారులకు

అన్ని రకాల వ్యాపారులకు వసూళ్లు బావుంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసొస్తాయి. నిర్మాణ రంగంలో ఉండేవారికి లాభం

విద్యార్థులకు

గురుబలం బావుంది.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మంచి ర్యాంకులు సాధిస్తారు. ఉన్నత విద్యకోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వ్యవసాయదారులకు

ఈ ఏడాది వ్యవసాయదారులకు రెండు పంటలు మంచి లాభాన్నిస్తాయి. పండ్లతోటలు, చేపల చెరువులు చేసేవారు లాభాలు ఆర్జిస్తారు

ఓవరాల్ గా

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ధనస్సు రాశి చిన్న చిన్న సమస్యలు మినహా యోగదాయకమైన సమయమే. జూన్ నుంచి జాగ్రత్త అవసరం