బ్యూటిఫుల్ గాళ్, 'బిగ్ బాస్' బ్యూటీ అషు రెడ్డి ఇప్పుడు ఫ్రాన్స్ లోని పారిస్ లో ఉన్నారు. పారిస్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. అది కనిపించేలా ఫోటోలు తీసుకుని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఫోటోల్లో ఈఫిల్ టవర్ ఉంటే అదే హైలైట్ అవుతుంది. కానీ, అషు రెడ్డి ఫోటోల్లో మరో టాపిక్ హైలైట్ అయ్యింది. అషురెడ్డి ఫోటోల్లో ఈఫిల్ టవర్ కంటే ఆమె బ్యాక్ లెస్ ఫోజులు గురించి జనాలు మాట్లాడుతున్నారు. అషురెడ్డి ఒంటిపై పవన్ కళ్యాణ్ టాటూ ఉంటుంది. అది కూడా ఈ ఫోటోల్లో కనిపించింది . అషురెడ్డి ఆ మధ్య బాగా వెయిట్ లాస్ అయ్యారు. సన్నబడిన తర్వాత ఆమె ఎక్కువ ఫోటోషూట్స్ చేస్తున్నారు. సినిమాల్లో క్యారెక్టర్స్ కాకుండా ఈ మధ్య అషురెడ్డి హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు. కథానాయికగా అషురెడ్డికి సరైన సక్సెస్ రాలేదు. అందుకని, రైట్ ఫిలిం కోసం వెయిట్ చేస్తున్నారు. అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (All Image Courtesy : Ashu Reddy / Instagram)