Image Source: pexels.com

కొబ్బరి నీళ్లు శరీరానికి అమృతంలా పనిచేస్తాయి. డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని కాపాడుతాయి.

Image Source: pexels.com

ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు, ఫినోలిక్ ఆమ్లాలు, అమైనో ఆమ్లాల వంటి సమ్మేళనాలు ఉన్నాయి.

Image Source: pexels.com

వ్యాయామం తర్వాత కొబ్బరినీళ్లు తాగితే శరీరం డీహైడ్రేట్ కాదు. ఎముకల ఆరోగ్యానికి, కండరాలు, నరాల పనితీరుకు మేలు చేస్తాయి.

Image Source: pexels.com

ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 44 కెలరీలు,10 గ్రాముల చక్కెర ఉంటుంది. సహజంగా దొరికే కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.

Image Source: pexels.com

దుకాణాల్లో బాటిల్లో లభించే కొబ్బరినీళ్లలో ఎక్కువగా షుగర్ యాడ్ అవుతుంది. లేబుల్ చెక్ చేసి తీసుకోవడం మంచిది.

Image Source: pexels.com

కొబ్బరి నీళ్లను అధికంగా తీసుకోవడం వల్ల హైపర్‌కలేమియాకు దారితీస్తుంది.

Image Source: pexels.com

కిడ్నీ సమస్యలు ఉన్న వ్యక్తులు లేదా శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తున్నవారు కొబ్బరి నీళ్లను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి.

Image Source: pexels.com

కొబ్బరి నీరు చర్మం, జుట్టుకు కూడా అద్భుతాలు చేస్తుంది. సూర్యరశ్మికి దెబ్బతిన్న చర్మానికి తిరిగి మెరుపు తెస్తుంది.

Image Source: pexels.com

కళ్ల కింద వాపు, నల్లటి వలయాలను తగ్గిస్తుంది. స్కాల్ప్ ఫ్లాకినెస్‌తో పోరాడుతుంది.