డయాబెట్స్ ఆల్టర్నేటివ్ షుగర్స్ వాడడం గురించి బాగా ప్రచారంలో ఉంది. అందులో ఒకటి కోకోనట్ షుగర్. కోకోనట్ షుగర్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ నెమ్మదింపజేస్తుంది. ఇందులో ఉండే ఇనులిన్ అనే డైటరీ ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ గ్రహించడం వల్ల మధుమేహులకు మేలు చేస్తుంది. కోకోనట్ షుగర్‌లో ఐరన్, జింక్, కాల్షియం, పోటాషియం ఉంటాయి. ఆడెడ్ షుగర్స్‌లో ఇదే ఆరోగ్యకరమైంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కనుక దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగదు. కొబ్బరిలో ఉండే చక్కెర సుక్రోజ్. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెంచుతుందనేది కొంతమంది నిపుణుల అభిప్రాయం. చక్కెర ఏదైనా సరే డయాబెటిస్ సమస్య ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవడమే మంచిది. అందుకు ఇది మినహాయింపు కాదు. Representational image:Pexels